యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘థగ్ లైఫ్’. ఈ భారీ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్ గా సెన్సేషన క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా చెన్నైలో భారీ ఆడియో లాంచ్ ఈవెంట్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోక నాయకుడు కమల్ హాసన్, అభిరామి, నాజర్, అశోక్ సెల్వన్, సినిమాటోగ్రాఫర్ రవి.కె.చంద్రన్ సహా పలువురు నటీనటులు, టెక్నీషియన్స్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ ‘‘ఈ జర్నీలో నాతో కలిసి ఎందరో ఉన్నారు. ఇప్పటికీ వారు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. గుండెల్లో ఎంతో కన్నీరుంది. సంతోషంతో వచ్చే కన్నీరుంది.. బాధతో నిండిన కన్నీరు కూడా ఉంది. ఎంతో మంది, ఎన్నో తరాలుగా నన్ను ఆదరిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తప్ప మరేం చెప్పలేను. నేను సినిమాకు పెద్ద అభిమానిని.”
“థగ్ లైఫ్ సినిమా గురించి మాట్లాడాలంటే ముందుగా ఎ.ఆర్.రెహమాన్‌గారి గురించి. ఇళయరాజా తర్వాత తన సంగీతంలో నన్ను ముంచెత్తింది రెహమానే. వారిద్దరూ మన దక్షిణాది గర్వపడే గొప్ప కళాకారులు వారు. వారి వయసు మనం లెక్కపెట్టలేం. నన్ను, మణిరత్నం గారిని కలిపింది సినిమానే. ప్రేక్షకులు మమ్మల్ని చూసి వేసే విజిల్స్ మాకోసమే కాదు.. సినిమా కోసం కూడా అని నాకు తెలుసు. నేను ఇక్కడున్నందుకు సంతోషపడుతున్నాను.”
“సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్‌గారు గొప్ప టెక్నీషియన్. హాలీవుడ్ రేంజ్‌కు వెళ్లాల్సిన టెక్నీషియన్. ఆయనతో పని చేయటాన్ని గర్వకారణంగా భావిస్తాం. అన్బరివు గొప్ప యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేశారు. ఇక నటీనటుల విషయానికి వస్తే అందరూ భవిష్యత్తులో గొప్పవారు అవుతారు. శింబు తనెంత గొప్ప స్థాయిని చేరుకుంటాడో నాకు తెలుస్తుంది. ఈ సమూహాన్ని ముందుకు నడిపే నాయకుడిగా శింబు ఎదుగుతాడు. ఆ బాధ్యత తనకుంది.”
“త్రిష గురించి చెప్పాలంటే బాహ్య సౌందర్యమే కాదు.. మానసికంగా ఎంతో అందమైనవారు. మరోవైపు జీవాగా నటించిన అభిరామి.. గొప్పగా నటించారు. అశోక్ సెల్వన్‌ను చూస్తుంటే నాజర్‌ను చూస్తున్నట్లే అనిపించింది. నాజర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాను చూసేటప్పుడు అందరూ ఎంతో సంతోషిస్తారు. కానీ తీసేటప్పుడు చాలా సమస్యలను దాటి చిత్రీకరించాల్సి ఉంటుంది. అలాంటి సమస్యలను నేను ఎన్నింటినో దాటి వచ్చాను.”
“అందుకు కారణం.. అభిమానులే. వారికి నేను ఎలా ధన్యవాదాలు చెప్పలో కూడా తెలియటం లేదు. అలాంటి వారి కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను ముఖ్యమంత్రి కావటానికో, ఎం.ఎల్.ఎ, ఎం.పి నోమకావటానికి రాజకీయాల్లోకి రాలేదు. ఓ ఎం.ఎల్.ఎ ఏం చేస్తాడో దాన్ని తమిళనాడుకి మెల్లగా చేస్తున్నాం. నాతో పాటు ఉన్నవారందరూ ఇప్పుడు సమాజంలో పెద్దవారిగా ముందుకు నడుస్తున్నారు. అది నాకెంతో గర్వంగా ఉంటుంది. రేపు శింబు కూడా తన వారిని అలాగే ముందుకు తీసుకెళ్లాలి.”
“నాజర్‌కు తమిళం అంటే.. సినిమా అంటే ఎంత ప్రేమో చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాలు విజయం సాధించటానికి ఏం చేయాలనే దానిపై మేం చాలా సార్లు మాట్లాడుకున్నాం. జో జో జార్జ్ గురించి ముందు నాకు తెలియదు. తను నటించిన ‘రెట్టె’ అనే సినిమా చూశాను. గొప్పగా నటించాడు. నేను అసూయ పడే నటుల్లో తనొకడు. చంద్రహాసన్ గారి తర్వాత నాకు దొరికిన గొప్ప సపోర్ట్ మహేంద్రన్. థగ్ లైఫ్ ఓటీటీ, శాటిలైట్ మినహా సినిమాను మేమే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామంటే సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. సినిమా తప్పకుండా అందరినీ మెప్పిస్తుంది. ఈ జర్నీలో నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























