అడివి శేష్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘డకాయిట్’ ఎక్సయిటింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించబోతోంది. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో కథానాయిక నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ ప్రాజెక్ట్‌లో ఒక పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఒక ఎక్సయిటింగ్ అప్‌డేట్‌తో వచ్చారు. మే 26న డకాయిట్ మూవీ నుంచి ‘ఫైర్ గ్లింప్స్’ పేరుతో స్పెషల్ వీడియోను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో అడివి శేష్ ఇంటెన్స్ లుక్‌లో దూరంగా ట్రైన్, కార్ ఫైర్ యాక్సిడెంట్‌ని చూస్తూ కనిపించడం ఫైర్ గ్లింప్స్‌పై క్యురియాసిటీని పెంచుతోంది.
షనీల్ డియో దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తోంది. డకాయిట్ కథ, స్క్రీన్‌ప్లేను శేష్, షనీల్ డియో సంయుక్తంగా రూపొందించారు. హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో షూటింగ్ జరుగుతున్న మూవీ ఆడియన్స్‌కి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించబోతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























