ఓజీలో పవన్ కళ్యాణ్ కోసం పాడటం నిజంగా ఒక డ్రీమ్

Thug Life Actor Simbu Says, It's A Dream For Singing in Pawan Kalyan's OG

ఈ సంవత్సరం సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘థగ్ లైఫ్’ ఒకటి. కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన ఈ సంస్థ ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాను కూడా భారీ స్థాయిలో విడుదల చేయబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ హైదరాబాద్‌లో మీడియా మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరో శింబు మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. తెలుగు ఆడియన్స్ నాకు చాలా స్పెషల్. నా బిగినింగ్ కెరియర్‌లో మన్మధ సినిమాకి తెలుగు ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ మర్చిపోలేను. ‘ఓజీ’ సాంగ్ కూడా త్వరలో రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారి కోసం పాడటం నిజంగా ఒక డ్రీమ్. థాంక్యూ సో మచ్ మణిరత్నం గారు ఆయన క్రమశిక్షణ, టైమింగ్ అద్భుతం. కమల్ గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్‌” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.