హరి హర వీరమల్లు ట్రైలర్ రానుంది

Hari Hara Veera Mallu trailer dropping soon

తెలుగులో పెద్ద సినిమాలు వచ్చి చాలా రోజులవుతుంది. ఈనెలలో కూడా ఏమి రావడం లేదు. అయితే వచ్చే నెల నుండి మాత్రం స్టార్ హీరోల సినిమాలు క్యూ కడుతున్నాయి.అందులో మొదటగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రానుంది.జూన్ 12 న పాన్ ఇండియా రిలీజ్ కానుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో వుంది ఈసినిమా.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు.అందులో భాగంగా వరుస అప్ డేట్స్ ఇస్తున్నారు.రెండు రోజుల క్రితం థర్డ్ సింగిల్ రిలీజ్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక కీలకమైన ట్రైలర్ రిలీజ్ కానుంది.కుదిరితే ఈనెల 27న లేకపోతే 28న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే వారణాసి , తిరుపతి లో రెండు భారీ ఈవెంట్ లను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను క్రిష్ ,జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేయగా నిధి అగర్వాల్ ,నోరా ఫతేహి, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో 100 కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత ఏఏం రత్నం నిర్మిస్తున్నారు.

ఇక పవన్ ప్రస్తుతం ఓజీ పూర్తి చేయాలని చూస్తున్నాడు.రీసెంట్ గానే ఓ షెడ్యూల్ కంప్లీట్ కాగా ఈరోజు నుండి ముంబై లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. పవన్ శనివారం నుండి ఇందులో జాయిన్ కానున్నాడు.సుజీత్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.