జూలైలో రానున్న పరదా

Anupama Parameswaran’s Paradha Release Date Announced

తన తొలి సినిమా ‘సినిమా బండి’ ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఇప్పుడు తన రెండవ చిత్రం ‘పరదా’తో వస్తున్నారు. మోస్ట్ ట్యాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత వంటి అద్భుతమైన తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఆనంద మీడియా బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ తో పాపులరైన రాజ్, డికె ఈ చిత్రానికి మద్దతు ఇస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే విడుదల ఫస్ట్ లుక్ పోస్టర్, కాన్సెప్ట్ వీడియో, సినిమా టీజర్‌, ‘మా అందాల సిరి’ అనే సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా పరదా చిత్రం నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ పంచుకుంది చిత్ర బృందం. ఈ సినిమాను జూలైలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ ప్రత్యంగిర సంస్థ దక్కించుకుంది.

ఇక ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ గోపీ సుందర్ చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందిస్తుండగా.. మృదుల్ సుజిత్ సేన్ డీవోపీగా పని చేస్తున్నారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటర్‌గా, శ్రీనివాస్ కళింగ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.