మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర గ్లోబల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంటుంది.అందులో భాగంగా నిర్మాత విక్రమ్ రెడ్డి విశ్వంభరను అంతర్జాతీయ వేదిక అయిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తీసుకెళ్లారు.అక్కడ విశ్వంభర ఎక్స్‌క్లూజివ్ బుక్‌ను లాంచ్ చేశారు.ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్ లో ఆయన సినిమా కథ, భారతీయ పురాణాల ప్రాధాన్యత, బుక్ విశేషాలు గురించి అలాగే సినిమా స్థాయి, విఎఫ్ఎక్స్ స్టూడియోల సహకారం గురించి వివరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మోస్ట్ అవైటెడ్ సోషియో ఫాంటసీ గా వస్తున్న ఈసినిమా ఇప్పటికే భారీ హైప్ ను క్రీయేట్ చేసుకుంది.ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.టాప్ హాలీవుడ్ విఎఫ్ఎక్స్ స్టూడియోల భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే 90% పూర్తయ్యాయి.త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్ ,కునాల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























