స్ట్రీమింగ్ లోకి రాబిన్ హుడ్

robinhood now streaming on zee5

గత నెలలో హీరో నితిన్ రాబిన్ హుడ్ తో థియేటర్లలోకి రాగ ఈ సినిమా కూడా తనకు కావాల్సిన విజయాన్ని అందించలేకపోయింది.భీష్మ కాంబినేషన్ కావడం అలాగే ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ రావడంతో హైప్ తో రిలీజయ్యింది రాబిన్ హుడ్. అయితే ఆ అంచనాలను మాత్రం అందుకోలేక నిరాశపరిచింది. ఇక ఈసినిమా ఈ రోజు ఓకే సారి ఓటిటి అలాగే టీవీల్లోకి వచ్చేసింది.జీ తెలుగు శాటిలైట్ హక్కులు దక్కించుకోగా జీ 5 ఓటిటి రైట్స్ సొంతం చేసుకుంది.దాంతో రెండిట్లోకి ఒకే సారి వచ్చింది.ఈసాయంత్రం 6 గంటలకు జీ 5లో స్ట్రీమింగ్ లోకి రాగ అదే సమయానికి జీ తెలుగులో ప్రీమియర్ పడింది.వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈసినిమాలో నితిన్ సరసన శ్రీలీల నటించగా ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ లో కనిపించాడు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నితిన్ నెక్స్ట్ తమ్ముడు తో రానున్నాడు.వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.ఈసినిమాతో లయ రీ ఎంట్రీ ఇస్తుండగా సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తుంది.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.జూన్ 20న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.మరి ఈసినిమాతో నితిన్ కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.

ఈసినిమా తరువాత నితిన్ ఎల్లమ్మలో నటించనున్నాడు.బలగం ఫేమ్ వేణు ఎల్దండి ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు.పక్కా రూరల్ బ్యాక్ డ్రాప్ లో రానుంది. ఈఏడాది షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.