కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు, హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సింగిల్’. అందాల భామలు కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించగా.. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన సింగిల్ నిన్న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తొలి ఆటతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం అందరినీ అలరించి సమ్మర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో హీరో, హీరోయిన్స్ సహా చిత్ర యూనిట్ అంతా పాల్గొంది.
ఈ సందర్భంగా నటుడు వెన్నెల కిషోర్ మాట్లాడుతూ.. “ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్యూ సో మచ్. నేను హీరోగా నటించిన ఫస్ట్ సినిమా (నవ్వుతూ). థియేటర్లో చూసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ప్రతి డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రెడిట్ భాను నందుకి దక్కుతుంది. గీత ఆర్ట్స్ కి థాంక్యూ. శ్రీ విష్ణు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఇచ్చిన ఫ్రీడంతోనే క్యారెక్టర్ ఇంత అద్భుతంగా వచ్చింది. ఇవానా కేతిక చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి థాంక్యూ. అందరికీ థాంక్యు సో మచ్” అని అన్నారు.
ఇక సింగిల్ మూవీ డైరెక్టర్ కార్తీక్ రాజు మాట్లాడుతూ.. “సినిమాకి వచ్చిన బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ కి థాంక్యూ. ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి మా నిర్మాతలకి థాంక్యూ. శ్రీ విష్ణు గారు గత మూడేళ్లుగా చాలా అద్భుతమైన సపోర్ట్ చేశారు. వెన్నెల కిషోర్ గారికి, కేతిక ఇవానా భాను నందు అందరికీ థాంక్యూ. ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్యూ” అని తెలిపారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























