మన ఆర్మీని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది – అడివి శేష్

Actor Adivi Sesh Express Gratitude on Indian Military at HIT 3 Success Meet

నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ HIT: ది 3rd కేస్. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మే 1న పాన్ ఇండియా వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అయిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీటింగ్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. “ముందుగా మన దేశం కోసం మన సైనికులు పోరాడుతున్న విధానం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. వాళ్లు గర్వపడేలా మనం జీవించాలి అనిపించింది. ఈ సెలబ్రేషన్స్ గురించి నానికి అడిగినప్పుడు ప్రభుత్వం మనకి అండగా ఉంది, సైన్యం మనల్ని రక్షిస్తుంది, అంతా నార్మల్ గా ఉండాలి, ఆ సందేశాన్ని జనాల్లోకి పంపిద్దాం అన్నారు.” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఆ మాట నాకు చాలా నచ్చింది. సినిమా విషయానికొస్తే హిట్ 3ని ఆడియన్స్ అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. అర్జున్ సర్కార్ మృదుల ఫెంటాస్టిక్‌గా ఉన్నారు. సినిమా ధియేటర్‌లో మంచి ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చింది. నా చిన్న అప్పియరెన్స్‌కి చాలా మంచి కాంప్లిమెంట్స్ రావడం హ్యాపీగా అనిపించింది. త్వరలోనే మీ అందరిని థియేటర్స్‌లో కలవాలని చూస్తున్నాను. అప్పటివరకు హిట్ 3 వైబ్‌ని ఎంజాయ్ చేద్దాం” అని చెప్పారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.