ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న 22వ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుందనుకుంటే ఇప్పుడు ఆ ప్లేస్ లో కేవలం టైటిల్ ను మాత్రమే రివీల్ చేస్తున్నారు. ఈనెల 15న రామ్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా నుండి అప్డేట్ రానుందని తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ సాంగ్ ఇంకా రెడీ కాకపోవడంతో కేవలం టైటిల్ గ్లింప్స్ ను మాత్రమే రిలీజ్ చేయనున్నారు.నిన్న మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.వచ్చే నెలలో సాంగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి శెట్టి ఫేమ్ మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.సగానికిపైగా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. అన్ని కుదిరితే దసరా బరిలో నిలపాలని చూస్తున్నారు.
ఇక ఈసినిమాపై రామ్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. రామ్ సాలిడ్ హిట్ కొట్టి చాలా రోజులు అయ్యింది. ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ నాలుగు సినిమాలు చేసినా ఆ రేంజ్ హిట్ కొట్టలేకపోయాడు.దాంతో ఈ 22 వ సినిమాతో నైనా రామ్ హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























