డ్రాగన్ తో ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యింది యంగ్ హీరోయిన్ కయాదు లోహర్.ఈసినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం అలాగే ఇందులో తన గ్లామర్ కి యూత్ ఫిదా కావడంతో కయాదు పేరు మారుమోగింది.ఈసినిమా వల్ల ఆమె ఒకటి కాదు రెండు కాదు వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ ఫుల్ బిజీ అవుతుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ తమిళంలో మూడు సినిమాలు చేస్తుంది. రీసెంట్ గానే రెండు సినిమాలకు సైన్ చేసింది. అలాగే మళయాలంలో నివిన్ పౌలీతో ఓ సినిమా చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగులో కూడా సూపర్ ఆఫర్లు వస్తున్నాయట.అల్లూరి అనే సినిమాతో మూడేళ్ళ క్రితమే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కయాదు.కానీ ఆ సినిమా హిట్ కాకపోవడంతో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అయితే డ్రాగన్ తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా రిలీజై సూపర్ హిట్ అనిపించుకుంది.దాంతో దర్శకుల చూపు ఈ హీరోయిన్ పడింది.
ప్రస్తుతం కయాదు తెలుగులో విశ్వక్ సేన్ సరసన ఫంకీ చేస్తుంది. అనుదీప్ ఈసినిమా ను డైరెక్ట్ చేస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.ఇది కాకుండా కయాదు తాజాగా మరో రెండు సినిమాలను లైన్లో పెట్టిందని టాక్. అందులో భాగంగా రవితేజ నెక్స్ట్ సినిమాలో కయాదును హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారట.అలాగే నాని శ్రీకాంత్ -ఓదెల ల మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్ లో ఓ హీరోయిన్ గా కయాదు ను ఫిక్స్ చేశారట. మరో హీరోయిన్ ఎవరనేది త్వరలోనే తెలియనుంది.మొత్తానికి ఒక్క సినిమా తో కయాదు ఫేట్ మారింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: