హర్రర్, సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్లర్, యాక్షన్ తరహా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ వుంటుంది. ఇంకా చెప్పాలంటే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసే ఈ సినిమాలను చూసేందుకు వారు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఇవి రెగ్యులర్‌గా రావు కాబట్టి, అందులోనూ తెలుగులో అడపాదడపా వస్తుంటాయి కాబట్టి, వీటికోసం ఒకింత ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు మూవీ లవర్స్. ఇప్పడు ఈ కోవలో తెరకెక్కింది ఓ తెలుగు చిత్రం.. అదే ‘బ్లైండ్ స్పాట్’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్యాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ చిత్రం రేపు థియేటర్లలోకి వస్తోంది. యంగ్ డైరెక్టర్ రాకేష్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామకృష్ణ వీరపనేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, థియేట్రికల్ ట్రైలర్ సహా ‘కనిపించేవన్నీ’ లిరికల్ వీడియో సాంగ్ వంటివి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
అయితే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.. దానికితోడు చిత్రయూనిట్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొని కావాల్సినంత బజ్ క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు మేకర్స్. ఈ సినిమా ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ అందించడం ఖాయమని మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన నేపథ్యంలో.. బ్లైండ్ స్పాట్ రేపు విడుదల అవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..
బ్లైండ్ స్పాట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఇవే..!
కథ
బ్లైండ్ స్పాట్ పక్కా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫార్మాట్‌లో రూపొందింది. ఈ సినిమాకు కథే ప్రధాన బలం. అందుకే దర్శకుడు ఈ విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ టైప్ చిత్రాల నుంచి ప్రేక్షకులు ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో వాటిని పొందుపరిచారు. ఇక ఈ చిత్రం ట్రైలర్‌ను చూస్తే.. మొదట్లోనే ఒక లేడీ మర్డర్ జరగడం, ఇది గమనించి పనిమనిషి పోలీసులకు కాల్ చేయడం, వారు వచ్చి విచారణ ప్రారంభించడం.. ఇలా ప్రతిక్షణం ఉత్కంఠకు గురిచేసేలా తీర్చిదిద్దారు.
ఇన్వెస్టిగేషన్ అధికారిగా హీరో నవీన్ చంద్ర ఎంట్రీ, ఆయన విచారణ చేసే విధానం ఆకట్టుకునేలావుంది. చివరికి హంతకుడు దొరికాడు అని, సస్పెన్స్ రివీల్ చేయకుండా ముగించిన విధానం సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేసింది. చూసే ప్రేక్షకుడికి ఆ హంతకుడు ఎవరు? అని కుతూహలం కలిగేలా చేశారు. అయితే ఇది కేవలం ట్రైలర్‌కు మాత్రమే పరిమితమవకుండా సినిమా ఆద్యంతం ఇదే సస్పెన్స్ అండ్ థ్రిల్ కొనసాగేలా దర్శకుడు దీనిని రూపొందించారు.
స్టార్ కాస్టింగ్
బ్లైండ్ స్పాట్‌లో నవీన్ చంద్ర ప్రధానపాత్రలో కనిపించారు. అయితే ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా గుర్తింపు పొందిన అయన ఆ తర్వాత పలు చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. అయితే తను కేవలం హీరో పాత్రలకే పరిమితమవకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్‌లో సైతం నటించి మంచి నటుడు అనిపించుకున్నారు. ఈ క్రమంలో ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాడు.
ఇక ఆయనతోపాటు రాశి సింగ్, బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా, రవి వర్మ, గాయత్రి భార్గవి, కిషోర్ కుమార్, హారిక పేడాడ, హర్ష రోషన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. “ఇక ఈ సినిమా పోస్టర్‌లో ఒక క్లూ ఉంది, అది కనిపెట్టి నాకు మెసేజ్ చేస్తే వాళ్లతో కలిసి నేను సినిమా చూస్తాను” అని హీరో నవీన్ చంద్ర ప్రకటించిన నేపథ్యంలో ఎక్కువమంది ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
శ్రీరామ్ మద్దూరి మ్యూజిక్
ఈ తరహా సినిమాలకు సంగీతం ఎంత ముఖ్యమో తెలిసిందే. అందుకే మేకర్స్ ఈ చిత్రానికి పలు హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన ట్యాలెంటెడ్ టెక్నిషియన్ శ్రీరామ్ మద్దూరికి మ్యూజిక బాధ్యతలు అప్పగించారు. వారి అంచనాలకు తగ్గట్టే ఆయన ఈ మూవీకి అద్భుతమైన సంగీతం అందించారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన బ్లైండ్ స్పాట్ థియేట్రికల్ ట్రైలర్ గమనిస్తే ఇది అర్ధమవుతుంది. స్టార్టింగ్ నుంచీ ఎండింగ్ వరకూ ఉత్కంఠగా సాగిన ఈ ట్రైలర్‌లో మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమాపై క్యూరియాసిటీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది.
ప్రొడ్యూసర్ – ప్రొడక్షన్ వాల్యూస్
మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామకృష్ణ వీరపనేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మ్యాంగో సంస్థకి ఇండస్ట్రీ వర్గాలలో మంచి పేరుంది. సినిమాలకు సంబంధించి డిజిటల్ మీడియా రంగంలో ఎప్పటినుంచో దిగ్గజ సంస్థగా వెలుగొందుతోంది. ఆ సంస్థ నుంచి వస్తున్న సినిమా అంటే ప్రేక్షకులలో సినిమా బాగుంటుందనే భావన ఉంటుంది. ఈ అంచనాలకు తగ్గకుండా అత్యున్నత నిర్మాణ విలువలతో ఒక మంచి మూవీని ప్రేక్షకులకు అందిస్తోంది మ్యాంగో.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























