రీసెంట్ గా థియేటర్లలో విడుదలైన రెండు సినిమాలు ఈరోజు ఓటిటిలోకి వచ్చేశాయి.అందులో ఒకటి గుడ్ బ్యాడ్ అగ్లీ కాగా మరొకటి జాక్.ఈ రెండు సినిమాలు ఏప్రిల్ 10నే విడుదలయ్యాయి.ఇందులో భారీ అంచనాలతో వచ్చిన తల అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఫుల్ రన్ లో ఈసినిమా 200 కోట్లపైనే వసూళ్లను రాబట్టి అజిత్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.ఈసినిమా ఈరోజు నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది.తమిళం తోపాటు తెలుగు , కన్నడ ,మలయాళ హిందీ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేయగా త్రిష కథానాయికగా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించింది.తమిళంలో ఇదే వారికి మొదటి సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక టిల్లు స్క్వేర్ తరువాత యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నుండి వచ్చిన సినిమా కావడంతో మంచి అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది జాక్.అయితే జాక్ ఆ అంచనాలను అందుకోలేకపోయింది.బాక్సాఫీస్ వద్ద ఈసినిమా పూర్తిగా నిరాశపరిచింది.
ఇక ఈసినిమాను కూడా నెట్ ఫ్లిక్స్ ఈరోజు నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. తెలుగుతోపాటు మిగతా పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది.అచ్చు రాజమణి ,సామ్ సీఎస్ ఈసినిమాకు సంగీతం అందించారు.ఎస్విసిసి నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























