సూర్య గొప్ప మనస్సు.. అగరం ఫౌండేషన్‌కు భారీ విరాళం

Kollywood Hero Suriya Donates Rs.10 Cr To Agaram Foundation From Retro Profits

తమిళ స్టార్ హీరో సూర్య మరోసారి తన గొప్ప మనస్సు చాటుకున్నారు. ప్పటికే ఎన్నోసార్లు తన ఉదారతను చాటుకున్న ఆయన తాజాగా ‘అగరం ఫౌండేషన్‌’కు రూ.10 కోట్ల భారీ విరాళం అందించారు. ఆయన కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రెట్రో’. సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని సూర్య స్వయంగా నిర్మించడం విశేషం. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మే 1న రిలీజై మంచి మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో ఈ చిత్రానికి వచ్చిన లాభాల్లో నుంచి సూర్య రూ..10 కోట్లు అగరం ఫౌండేషన్‌కు విరాళంగా అందించారు. ఇక ఈ సందర్భంగా రెట్రో చిత్ర యూనిట్ కూడా సూర్య వెంట ఉన్నారు. ఇటీవలే ఈ సంస్థ కార్యాలయం మరియు స్కూల్ బిల్డింగ్ కూడా సొంతంగా కట్టించారు సూర్య. కాగా అగరం ఫౌండేషన్ అనేది సూర్య నేతృత్వంలోని విద్యాసంస్థ. పేద విద్యార్థులకు మరియు తల్లిదండ్రులను కోల్పోయిన విధివంచిత పిల్లలకు ఈ ఫౌండేషన్ ద్వారా విద్యను అందిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.