నవీన్ చంద్ర హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్లైండ్ స్పాట్’. యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ రాకేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామకృష్ణ వీరపనేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, థియేట్రికల్ ట్రైలర్ మరియు ‘కనిపించేవన్నీ’ లిరికల్ వీడియో సాంగ్.. సినిమాపై అంచనాలు పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మే 9న ప్రేక్షకుల థియేటర్లలోకి వస్తోంది. దీంతో ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేశారు మేకర్స్. ఇక ఈ మూవీకి షార్ట్ రన్ టైం లాక్ చేశారు మేకర్స్. ఎండ్ టైటిల్స్‌తో కలుపుకుని మొత్తం 1గం 31ని.ల రన్ టైంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసే ఈ తరహా చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకు తగ్గట్టే ఈ సినిమా ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ అందించనుంది.
బ్లైండ్ స్పాట్‌లో రాశి సింగ్ హీరోయిన్‌గా నటించగా.. బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా, రవి వర్మ, గాయత్రి భార్గవి, కిషోర్ కుమార్, హారిక పేడాడ, హర్ష రోషన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీరామ్ మద్దూరి సంగీతం అందిస్తుండగా.. దర్శన్ ఎమ్ అంబట్ సినిమాటోగ్రఫీ, సత్య. జి ఎడిటింగ్ నిర్వహించారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: