సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల ‘కుబేర’. అద్భుతమైన తారాగణంతో కుబేర భారతీయ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోంది. జూన్ 20న కుబేర ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. హీరో ధనుష్, హీరోయిన్ రష్మిక మందన్న చిరునవ్వులు చిందిస్తున్న ఈ పోస్టర్ అదిరిపోయింది. ఇప్పటికే సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ అద్భుతమైన స్పందనతో అంచనాలను పెంచింది.
అలాగే ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగల్ ‘పోయిరా మామ’ చార్ట్ బస్టర్ హిట్ అయింది. మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ‘పోయిరా మామా’ సాంగ్‌తో కుబేర మీద ఉన్న హైప్ నెక్స్ట్ లెవెల్‌కి చేరుకుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడిన నేపథ్యంలో త్వరలోనే ప్రమోషన్స్‌ను కిక్ స్టార్ట్ చేయబోతున్నారు మేకర్స్.
క్యారెక్టర్ బేస్డ్ నేరేటివ్స్‌తో అదరగొట్టే శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని నెవర్ బిఫోర్‌గా తీర్చిదిద్దారు, ఇది ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు హై బడ్జెట్, హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























