దిల్ రాజు ప్రతి విషయంలో ముందుంటారు – అల్లు అరవింద్

Producer Allu Aravind Congratulates Dil Raju For Launching Larven AI Studio

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు టెక్నాలజీని సినీ రంగంలోకి పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో క్వాంటం భాగస్వామ్యంతో ‘లోర్వెన్ AI’ అనే సరికొత్త స్టూడియోను తాజాగా లాంచ్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఈ స్టూడియో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతులమీదుగా ప్రారంభం అయింది. సినీ పరిశ్రమకు చెందిన అతిరధమహారధులు హాజరైన ఈ వేడుకు చాలా గ్రాండ్ గా జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తెలంగాణ మంత్రివర్యులు శ్రీధర్ గారికి, దర్శకులు రాఘవేంద్రరావు గారికి, ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ పేరుపేరునా అభివందనం. దిల్ రాజు గారు పాతికేళ్లుగా నాకు తెలుసు. ఆయన ప్రతి దాంట్లో ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు అదే క్రమంలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి ఏఐ ని ప్రవేశ పెట్టడంలో ముందడుగు వేశారు. సినిమా ఇండస్ట్రీకి ఎఐ ఒక కోలాబరేటరీ అని భావిస్తున్నాను. తన ప్రతిష్టాత్మకమైన కంపెనీని లోగోని లాంచ్ చేసిన అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారికి ధన్యవాదాలు. సినిమా రషెస్ చూపించి రిజల్ట్ ఏమిటని ఎఐని అడగాలని వుంది” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.