వార్ 2 తో ఎన్టీఆర్ హిందీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సార్ట్ అయినప్పటి నుండి ఒక్క రిలీజ్ డేట్ తప్ప ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యినట్లే. కానీ ఇప్పటివరకు ఒక్క పోస్టర్ కూడా దింపలేదు.ఇందులో హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తుండడం తో హిందీలో కావాల్సినంత బజ్ వుంది.అయితే హిందీ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ వచ్చిన సందర్భాలు చాలా రేర్.కానీ ఎన్టీఆర్ ఉండడంతో వార్ 2 తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది.రెండు బడా నిర్మాణ సంస్థలు ఈహక్కులను దక్కించుకోవాలని చూస్తున్నాయి.దాదాపు 100కోట్ల ధర పలుకున్నాయట ఈరైట్స్.మరి ఈసినిమాను తెలుగులో ఎవరు విడుదలచేస్తారో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్రహ్మస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.ఈ ఏడాది ఆగస్టు 14న వార్ 2 ను థియేటర్లలోకి తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.ఈనెల 20 ఎన్టీఆర్ బర్త్ డే ఉండడం తో ఆ రోజు వార్ 2 నుండి అప్డేట్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ఎన్టీఆర్ నీల్ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నాడు.రీసెంట్ గానే ఎన్టీఆర్ ఈషూటింగ్ లోనే జాయిన్ అయ్యాడు.ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండగా రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి. జూన్ 25న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























