కింగ్‌డమ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

Kingdom First Single Released

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మచ్ అవైటెడ్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా, సూపర్ రెస్పాన్స్ అందుకుంది. సమ్మర్ కానుకగా ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది కింగ్‌డమ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ను నేడు రిలీజ్ చేసింది చిత్ర బృందం. రెండు రోజులక్రితం విడుదల చేసిన దీని ప్రోమో సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేయగా.. ఇప్పడు ఈ పాట ఫుల్ లిరికల్ వీడియో అంచనాలను మరింతగా పెంచేసింది. ‘హృదయం లోపల’ అంటూ సాగే ఈ పాటకు కృష్ణకాంత్ అద్భుతమైన సాహిత్యం అందించగా.. అనిరుధ్ రవిచందర్ మరియు అనుమిత నదేశన్ శ్రావ్యంగా ఆలపించారు.

ఇక కొన్నేళ్లుగా అనిరుధ్ తన అద్భుతమైన సంగీతంతో ఆడియెన్స్‌ని అలరిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని సినిమాలు కేవలం అనిరుధ్ మ్యూజిక్ వల్లనే హిట్ అయ్యాయని మూవీ లవర్స్ అంటుంటారు. బీజీఎమ్ ఒక్కటే కాకుండా సాంగ్స్‌లో సైతం అనిరుధ్ మ్యాజిక్ కనిపిస్తుంది. ఈ క్రమంలో కింగ్‌డమ్ పాటలపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ సింగిల్‌తో అది మరోసారి ప్రూవ్ అయింది. ఇక ఈ పాటని ఆయన కంపోజ్ చేయడమే కాకుండా స్వయంగా పాడటంతో దీనిపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సాంగ్ రానున్న రోజుల్లో సంచలనం సృష్టించనుందని మ్యూజిక్ లవర్స్ చెబుతున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.