తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో నిన్న మంచి అంచనాల మధ్య థియేటర్లలోకి రాగ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. దాంతో తమిళనాడు లో ఈసినిమా మొదటి రోజు సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.నిన్న అక్కడ 17.75 కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.తమిళనాడులో సూర్యకు ఇవే హైయెస్ట్ ఓపెనింగ్స్. ఈరోజు కూడా బుకింగ్స్ బాగానే వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తెలుగులో కూడా విడుదలకాగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3 కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. తెలుగులో హిట్ 3 దుమ్మురేపుతుండడం తో రెట్రో డీసెంట్ వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.ఓవరాల్ గా చూస్తే రెట్రో మొదటి రోజు 40 కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.అయితే రెట్రో తొలిరోజు కంగువా కలెక్షన్స్ ను దాటలేకపోయింది.
లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈసినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























