టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘క’ సినిమా అరుదైన గొరవం అందుకుంది. ప్రతిష్టాత్మక ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’కు నామినేట్ అయిన ఈ చిత్రం తాజాగా అవార్డు కైవసం చేసుకుంది. ఈ మేరకు తాజాగా జరిగిన 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల జాబితాను విడుదల చేయగా.. ఉత్తమ చిత్రం విభాగంలో ‘క’ అవార్డు దక్కించుకుంది. దీంతో మరోసారి మన తెలుగు సినిమా జాతీయవేదికపై సత్తా చాటినట్టయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గతేడాది అక్టోబర్ 31న విడుదలైన ఈ మూవీ సంచలన విజయం నమోదుచేసింది. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది ‘క’. కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సుజీత్, సందీప్ ద్వయం సంయుక్తంగా దర్శకత్వం వహించగా.. కిరణ్ సొంత బ్యానర్‌పై ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నయన్ సారిక కథానాయికగా నటించింది.
‘క’ కథేంటంటే..?
అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) ఓ అనాథ. అతనికి గురునాథం మాస్టర్ (బలగం జయరామ్) తన ఆశ్రమంలో ఆశ్రయమిస్తాడు. అయితే అతడికి తన తల్లిదండ్రులెవరో తెలుసుకోవాలన్న తపన ఎక్కువగా ఉంటుంది. ఇక వాసుదేవ్‌కి చిన్నప్పటి నుంచి ఇతరులకు వచ్చే ఉత్తరాలను చదివే అలవాటు ఉంటుంది. అవి చదవడం ద్వారా తాను పొగొట్టుకున్న బంధాల్ని ఆ రాతల్లో చూసుకుంటుంటాడు.
ఇలా ఒకసారి తనకు వచ్చిన ఒక ఉత్తరం చదివాడన్న కోపంతో గురునాథం మాస్టర్ వాసుదేవ్‌ని దండిస్తాడు. దీంతో ఆశ్రమంలోని కొంత డబ్బు తీసుకుని పారిపోయి కృష్ణగిరి అనే మారుమూల పల్లెలో కాంట్రాక్ట్ పోస్ట్‌మెన్‌గా చేరతాడు. అయితే అక్కడ చుట్టూ ఎతైన కొండలు ఉండటం వలన మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి పడుతుంటుంది.
అక్కడి పోస్ట్ మాస్టర్ రామారావు (అచ్యుత్ కుమార్) కుమార్తె సత్యభామ (నయన్ సారిక)తో ప్రేమలో పడతాడు. మరోవైపు తన మంచి నడవడికతో ఆ ఊరి ప్రజలతో కలిసిపోతాడు వాసుదేవ్. ఈ క్రమంలో అంతా బావుందని అనుకునే సమయంలో అనూహ్య ఘటనలు జరుగుతాయి. ఆ ప్రాంతంలో తెల్లవారుజామున అమ్మాయిలు మిస్ అవ్వడం గమనిస్తాడు వాసుదేవ్.
ఇతరుల ఉత్తరాలు చదివే అలవాటున్న వాసుదేవ్‌కు తన వద్దకు వచ్చే ఓ ఉత్తరం చదవడం ద్వారా ఈ మిస్సింగ్ కేసులకు సంబంధించి ఓ కీలక విషయం తెలుస్తుంది. దీంతో అతను ఇబ్బందుల్లో పడతాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతడిని ఓ గదిలో బంధిస్తారు. ఒక ముసుగు మనిషి అతడిని హంతకుడని అంటుంటాడు.
అయితే క్రిష్ణగిరిలో తెల్లవారుజామున అమ్మాయిలు తప్పిపోవడానికి కారణమేంటి? అభినయ్ వాసుదేవ్ వాసుదేవ్‌ను చీకటి గదిలో బంధించింది ఎవరు? లాలా, అబిద్ షేక్‌ల వ్యవహారమేంటి? అభినయ్‌తోపాటు, అతడి గది పక్కన చీకటి గదిలో ఉన్న రాధ (తన్విరామ్) ఎవరు? వీరిద్దరి జీవితంలోకి వచ్చిన ఆ ముసుగు వ్యక్తి ఎవరు? వాసుదేవ్, సత్యభామ ప్రేమ కథ ఏమైంది? అసలు ఈ చీకటి గది నుంచి అభినయ్, రాధ క్షేమంగా బయటపడ్డారా? లేదా? అన్నదే మిగతా కథ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























