హాఫ్ మిలియన్ క్రాస్ చేసిన హిట్ 3

Hit 3 joins the half-million dollar club at the US box office

నాని హిట్ 3 మరికొన్ని గంటల్లో థియేటర్లోకి రానుండగా బుక్ మై షో లో రాంపేజ్ బుకింగ్స్ అవుతున్నాయి.ఏపీలో కూడా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.అక్కడ టికెట్ హైక్ కు పర్మిషన్ వచ్చింది.గంటకు 9 వేలకు పైగా టికెట్స్ బుకింగ్ తో ట్రెండ్ అవుతుంది.ఈరేంజ్ బుకింగ్స్ ఎవరు ఊహించలేదు.రేపు సెలవు కావడం కూడా కలిసొచ్చింది.తెలుగు తరువాత తమిళ వెర్షన్ బుకింగ్స్ కూడా సూపర్ గా అవుతున్నాయి.రెట్రోతోపోటీ వున్న కూడా చెన్నైలో మొదటి రోజు హిట్ 3కి షోస్ ఫుల్ అవుతున్నాయి.ఇక ఓవర్సీస్ లో అయితే నెక్స్ట్ లెవెల్ ప్రీమియర్స్ ప్రీ సేల్స్ అవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నానికి యూఎస్ఏ లో సాలిడ్ మార్కెట్ వుండడం తో ఏ రేటడ్ సినిమా అయినా కూడా హిట్ 3 అదరగొడుతుంది.ప్రీమియర్స్ ద్వారానే హాఫ్ మిలియన్ మార్క్ ను చేరుకోనుంది.నాని కెరీర్ లో హైయెస్ట్ ప్రీమియర్స్ గ్రాసర్ గా హిట్ 3 రికార్డు సృష్టించనుంది.హిట్ టాక్ వస్తే ఫుల్ రన్ లో 2 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరడం గ్యారెంటీ.

ట్రెండ్ చూస్తుంటే ఈసినిమా 20 కోట్ల ఓపెనింగ్స్ ను రాబట్టుకునేలానే వుంది.బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఎక్కువగానే వుంది.హిట్ టాక్ వస్తే ఆ టార్గెట్ పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.నాని ఈసినిమాను తెగ ప్రమోట్ చేశాడు.పాన్ ఇండియా రిలీజ్ కావడంతో అన్ని భాషల్లోనూ ప్రమోట్ చేశాడు.

మోస్ట్ వైలెంట్ మూవీగా శైలేష్ కొలను తెరకెక్కించిన ఈసినిమాలో నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.నానితో కలిసి ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.