కింగ్‌డమ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

Vijay Deverakonda's Kingdom First Single Promo Released

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ మూవీ ‘కింగ్‌డమ్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా, మంచి స్పందన వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సమ్మర్ కానుకగా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది కింగ్‌డమ్. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెడుతున్నారు. దీనిలో భాగంగా తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ ప్రోమోను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ ప్రోమో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. కాగా త్వరలోనే ఈ పాట ఫుల్ లిరికల్ వీడియోను విడుదల చేయనుంది.

ఇక గత కొన్నేళ్లుగా అనిరుధ్ తన అద్భుతమైన సంగీతంతో మ్యూజిక్ లవర్స్‌నే కాకుండా మూవీ లవర్స్‌ని సైతం అలరిస్తున్నారు. కొన్ని సినిమాలు కేవలం అనిరుధ్ మ్యూజిక్ వల్లనే హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని సినీప్రియులు అంటుంటారు. బీజీఎమ్ ఒక్కటే కాకుండా సాంగ్స్‌లో కూడా అనిరుధ్ మ్యాజిక్ కనిపిస్తుంది. ఈ క్రమంలో కింగ్‌డమ్ పాటలపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఇవి ఎలా ఉండబోతున్నాయి తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.