మచ్ అవైటెడ్ మూవీ ఎన్టీఆర్ నీల్ నుండి అప్డేట్స్ వచ్చాయి.అనౌన్స్ మెంట్ రోజున సినిమా సంక్రాంతికి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఆ డేట్ కు తీసుకరాలేకపోతున్నారు. దాంతో రిలీజ్ డేట్ ను మార్చారు. కొంచం ఆలస్యంగా జూన్ 25న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.అంతేకాదు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న ఎన్టీఆర్ నీల్ నుండి స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక షూటింగ్ విషయానికి వస్తే కర్ణాటకలో రీసెంట్ గానే కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇందులో ఎన్టీఆర్ జాయిన్ అయ్యాడు. దాదాపు రెండు వారాల పాటు కొనసాగనున్న ఈషెడ్యూల్ లో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.ఈ ఏడాది చివరి కల్లా షూటింగ్ మొత్తం కంప్లీట్ కానుంది.ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. ఈసినిమా కోసం హీరోయిన్ ను ఫిక్స్ చేయాల్సివుంది.ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండగా రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.
అయితే ఈసినిమా కన్నా ముందు ఎన్టీఆర్, వార్ 2 తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. షూటింగ్ కూడా పూర్తయినట్లే.బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు.యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ కు హిందీలో ఇదే మొదటి సినిమా.ఇప్పటివరకు అయితే అఫీషియల్ గా రిలీజ్ డేట్ తప్ప ఒక్క పోస్టర్ ను కూడా రిలీజ్ చేయలేదు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























