బ్లైండ్ స్పాట్ రిలీజ్ డేట్ ఫిక్స్

Naveen Chandra's Blind Spot Release Date Announced

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్లైండ్ స్పాట్’. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామకృష్ణ వీరపనేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నూతన దర్శకుడు రాకేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటించగా.. బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా, రవి వర్మ, గాయత్రి భార్గవి, కిషోర్ కుమార్, హారిక పేడాడ, హర్ష రోషన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీరామ నవమి కానుకగా రిలీజ్ చేసిన బ్లైండ్ స్పాట్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచగా.. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ బ్లైండ్ స్పాట్ చిత్రం విడుదల తేదీ ప్రకటించారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు నేడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

కాగా బ్లైండ్ స్పాట్ సినిమాకి శ్రీరామ్ మద్దూరి సంగీతం అందించగా.. దర్శన్ ఎమ్ అంబట్ సినిమాటోగ్రఫీ, సత్య. జి ఎడిటింగ్ నిర్వహించారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.