హిట్ 3 చాలా వైలెంట్‌గా ఉండబోతుంది

Hero Viswak Sen Praises Natural Star Nani at Hit 3 Pre Release Event

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘HIT: ది 3rd కేస్’. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ చిత్రం, టీజర్, ట్రైలర్ పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా హిట్ 3 మే 1న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ఆదివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మావెరిక్ డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే హిట్ 1, హిట్ 2 చిత్రాలలో హీరోలుగా నటించిన విశ్వక్ సేన్, అడివి శేష్ కూడా హాజరయ్యారు. వీరితోపాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొంది.

ఈ సందర్భంగా హీరో విశ్వక్సేన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్తే. హిట్ నాది, శేష్ ది, నాని అన్నది, హిట్ మాది, మన అందరిదీ. ఇదే స్టేజ్ మీద నాని అన్న ‘ఫలక్‌నుమా దాస్’ ఫంక్షన్‌కి వచ్చినప్పుడు నేను హీరోగా ‘హిట్’ అనౌన్స్ చేశారు. ఇదే వేదిక మీద హిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రాజమౌళి గారు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. రాజమౌళి గారి సపోర్టుకి థాంక్యూ సో మచ్. హిట్ నుంచి మరెన్నో సినిమాలు వస్తాయి.” అని తెలిపారు.

“నాని అన్న యాక్టర్‌గా హ్యాట్రిక్ కొట్టారు నిర్మాతగా హ్యాట్రిక్ కొట్టారు. నిర్మాతగా, యాక్టర్‌గా దీంతో సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ కాబోతుంది. ప్రశాంతి గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రొడ్యూసర్. మే 1న ఈ సినిమా చాలా వైలెంట్‌గా ఉండబోతుంది. ఇది చాలా న్యూ ఏజ్ ఫిలిం. హిట్ నా మనసుకి చాలా దగ్గరైన సినిమా. నా కెరీర్ గ్రోత్‌లో చాలా క్రూషియల్ ఫిల్మ్. హిట్ 3 వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.