కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఐకానిక్ మూవీ ‘బాషా’ తెలుగులో రీ రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ మీడియా కంపెనీ మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో బాషా రీ రిలీజ్ అవుతుండటం గమనార్హం. అయితే ఈ సినిమా రీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈనెల 25న మళ్ళీ థియేటర్లలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రీరిలీజ్ ట్రైలర్ విడుదలచేశారు మేకర్స్. ఇందులో బాషాగా సూపర్ స్టార్ స్టైల్, స్వాగ్ నెక్స్ట్ లెవెల్ అంతే.. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా 1995లో విడుదలైన బాషా సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. ఈ సినిమాతో రజినీకాంత్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అలాగే తెలుగులోనూ ఆయనకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది.ముంబై అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం.. ఆ తర్వాత హీరోకి పవర్ ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ పెట్టడంలో ఎన్నో సినిమాలకు బిగ్ ఇన్‌స్పిరేషన్‌గా నిలిచింది.సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈసినిమాలో నగ్మా హీరోయిన్‌గా నటించగా రఘువరన్ విలన్ పాత్రలో కనిపించారు. దేవా సంగీతం అందించగా, సత్య మూవీస్ నిర్మించింది.
ఇక ఇదిలావుంటే, రజినీకాంత్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రూపొందిస్తున్న ‘కూలీ’ ఒకటి. షూటింగ్ చివరిదశలో ఉంది. కింగ్ నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఆగస్టు 14న రిలీజ్ కానుంది.అలాగే దీనితోపాటు పాటు ‘జైలర్ 2’లో కూడా నటిస్తున్నారు రజినీ. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా..సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. కాగా ఈ రెండు సినిమాలపై ఇటు ఇండస్ట్రీలో, అటు అభిమానుల్లో భారీ అంచనాలే వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























