విజయ్ సేతుపతి ‘ACE’ రిలీజ్ డేట్ ఫిక్స్

Makkal Selvan Vijay Sethupathi’s ACE Release Date Fix

‘మక్కళ్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ACE’. భారీ అంచనాలున్న ఈ చిత్రం నుంచి కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాను మే 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు తాజాగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు స్పెషల్ పోస్టర్ కూడా విడదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అరుముగకుమార్ దర్శకత్వం వహించిన ACEలో విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్, యోగి బాబు, బి.ఎస్. అవినాష్, దివ్య పిళ్లై, బబ్లూ, రాజ్‌కుమార్ వంటి స్టార్ తారాగణం ఉన్నారు. ఈ చిత్రాన్ని 7Cs ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అరుముగకుమార్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇది కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని కరణ్ బహదూర్ రావత్ నిర్వహిస్తున్నారు, జస్టిన్ ప్రభాకరన్ పాటలు కంపోజ్ చేస్తున్నారు. సామ్ సి.ఎస్. నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఎడిటింగ్‌ను ఫెన్నీ ఆలివర్ నిర్వహిస్తున్నా. ఆర్ట్ డైరెక్షన్‌ను ఎ.కె. ముత్తు పర్యవేక్షిస్తున్నారు. పూర్తిగా మలేషియాలో చిత్రీకరించబడిన ACE చిత్రం టైటిల్ టీజర్, గ్లింప్స్, పాటల ద్వారా ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది,

కాగా ఈ సినిమా ఇప్పటికే సంచలనం సృష్టించడం ప్రారంభించింది. హై-ఆక్టేన్ యాక్షన్, గ్రిప్పింగ్ నెరేటివ్ బ్లెండ్ తో వస్తున్న ఈ చిత్రం కోసం విజయ్ సేతుపతి అభిమానులు, సినిమా ప్రేమికులు, ట్రేడ్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సో.. మూవీ లవర్స్ పవర్ ఫుల్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం గెట్ రెడీ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.