నవీన్ చంద్ర ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్లైండ్ స్పాట్’. మ్యాంగో మాస్ మీడియా బ్యానర్ పై రామ కృష్ణ వీరపనేని నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌కి రాకేష్ వర్మ దర్శకత్వం వహించాడు. అంచనాలను క్రమంగా పెంచుతోంది. కాగా ఈ చిత్రంలో రాశి సింగ్, అలీ రెజా, రవివర్మ, గాయత్రి భార్గవి కీలక పాత్రల్లో కనిపిస్తుండగా.. కిషోర్ కుమార్, హారిక పేడాడ, గురురాజ్ మానేపల్లి, హర్ష్ రోషన్, మాస్టర్ అభిషిక్త్ వంటి తారాగణం నటిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా డైరెక్టర్ రాకేష్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నవీన్ చంద్ర గారు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్. ఆయన ఎప్పుడూ క్యారెక్టర్ లోనే ఉంటారు. ప్రతి ఆర్టిస్టుతో చాలా సపోర్టివ్‌గా ఉంటారు. చాలా ఇన్వాల్వ్మెంట్తో వర్క్ చేస్తారు. ఇక రాశి సింగ్ గ్లిజరిన్ లేకుండా కన్నీళ్లు తెచ్చుకునే నటి. ఈ సినిమాలో తన క్యారెక్టర్‌కి రెండు వేరియేషన్స్ ఉన్నాయి. ఈ రెండు వేరియేషన్స్‌ని అద్భుతంగా పెర్ఫామ్ చేసింది” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “అలాగే గాయత్రి గారు ఇందులో చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. మా సినిమా అంతా ఒక సింగిల్ నైట్‌లో జరుగుతుంది. ఎక్కడా ఆ కంటిన్యూటీ మిస్ అవ్వకుండా ఆర్టిస్టులందరూ చాలా ఈజ్‌తో పెర్ఫార్మ్ చేశారు. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























