తమిళ స్టార్ హీరోలు కార్తి మరియు జయం రవి శబరిమల సందర్శించారు.ఈ మేరకు గురువారం రాత్రి అయ్యప్ప మాల ధరించిన కార్తి, జయం రవి ఇరుముడితో శబరిమలకి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. సాధారణ భక్తుల మాదిరే క్యూ లైన్లో వచ్చిన ఈ హీరోలు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా తాను తొలిసారి స్వామి మాల వేసుకుని శబరిమలకి వచ్చినట్టు తెలిపిన కార్తి, ఈ అనుభవం తనకు మానసిక శాంతిని, బలాన్ని ఇచ్చిందని చెప్పారు. అలాగే భవిష్యత్తులోనూ మణికంఠుడి దర్శనానికి రావాలని కోరుకుంటున్నానని మీడియాతో అన్నారు. ఇక మరో హీరో జయం రవి మాట్లాడుతూ.. “నేను 2015 నుండి శబరిమలకు వస్తున్నాను. ఇప్పటివరకూ 9సార్లు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాను. స్వామివారిపై నాకు ఎంతో నమ్మకం ఉంది” అని తెలిపారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























