యంగ్ హీరో విజయ్ దేవరకొండ మచ్ అవైటెడ్ మూవీ కింగ్ డమ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.అందులో భాగంగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతుంది. విజయ్ నిన్నటి నుండి తన పాత్రకు డబ్బింగ్ చెపుతున్నాడు.ఈరోజు తో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యింది.రేపటి లోగా మొత్తం పూర్తికానుంది.మరోవైపు ఈసినిమా రిలీజ్ వాయిదా పడనుందని రూమర్స్ వస్తున్నాయి. అయితే ఎట్టిపరిస్థితుల్లో సినిమాను అనుకున్న తేదీకి రిలీజ్ చేస్తామని నిర్మాత నాగవంశీ ఇంతకుముందే క్లారిటీ ఇచ్చాడు.త్వరలోనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి ప్రమోషన్ స్టార్ట్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తుండగా విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.మే 30న కింగ్ డమ్ రిలీజ్ కానుంది.ఈసినిమా విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలువనుంది.హిట్ టాక్ వస్తే ఫుల్ రన్ లో 300 కోట్ల సినిమా కానుంది.
ఇక ఈసినిమా రిలీజ్ తరువాత విజయ్ తన నెక్స్ట్ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు వున్నాయి. అందులో రవికిరణ్ కోలా తో చేయనున్న సినిమా ఒకటి.దిల్ రాజు నిర్మించనున్నారు.షూటింగ్ జూన్ నుండి స్టార్ట్ కానుంది.అలాగే టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ తో కూడా విజయ్ సినిమా చేయనున్నాడు విజయ్.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. విజయ్ ఈ రెండు సినిమాలను బ్యాలెన్స్ చేయనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























