ఓదెల 2 కోసం నేచర్ కూడా మాకు సపోర్ట్ చేసింది – తమన్నా

Actress Tamannaah Bhatia Says, Nature Also Supported Us During Odela 2 Shooting

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. ఈ చిత్రాన్ని గ్రాండ్ పాన్-ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు, సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్‌గా మల్టిపుల్ రోల్స్‌లో వర్క్ చేశారు. అలాగే డైరెక్షన్ సూపర్ విజన్‌ని అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అశోక్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్స్‌పై డి. మధు నిర్మిస్తున్నారు. టీజర్, మిగతా ప్రమోషనల్ కంటెంట్‌కి ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ.. “ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఇలాంటి సినిమాలు ఒక యాక్టర్‌కి చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమాలో పార్ట్ కావడం ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. సంపత్ నంది గారు ఈ సినిమాలో నా పాత్రని రాసిన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి కథలో నన్ను పార్ట్ చేసిన సంపత్ నంది గారికి కృతజ్ఞతలు” అని తెలిపారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ..”వశిష్ట సింహ చాలా అద్భుతమైన నటుడు. ఈ సినిమాల్లో తన పాత్ర టెర్రిఫిక్‌గా ఉంటుంది. గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్‌ని తన పెర్ఫార్మన్స్‌తో మరో స్థాయికి తీసుకువెళ్లాడు. ఈ సినిమాలో నేను చేసిన శివశక్తి పాత్రకు ఎలాంటి రిఫరెన్స్ లేదు. ఈ సినిమా కోసం నేచర్ కూడా మాకు సపోర్ట్ చేసిందని నమ్ముతున్నాం. ఈ సినిమా నాకు చాలా డిఫరెంట్ జర్నీ. ఇది గ్రాండ్ స్కేల్ కమర్షియల్ ఫిల్మ్. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది.” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.