ఓదెల 2 ట్రైలర్ రిలీజ్

Tamannaah Bhatia’s Odela 2 Trailer Released

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌ వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ప్రతి అప్‌డేట్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్సవం కాశీలో జరుగగా.. టీజర్‌ను ప్రయాగరాజ్‌లో నిర్వహించిన మహా కుంభమేళాలో లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవల రీలీజైన టీజర్ ఎక్సయిట్‌మెంట్ పెంచింది, అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఓదెల 2 థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసి మరింత జోష్ పెంచారు. ఈ మేరకు నేడు ముంబైలో నిర్వహించిన గ్రాండ్‌ ఈవెంట్‌లో లాంచ్ చేశారు. కోర్ టీమ్ హాజరైన ఈ కార్యక్రమంలో ఓదెల 2 తెలుగు మరియు హిందీ ట్రైలర్స్‌ను విడుదలచేశారు.

ఓదెల 2 ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా వుంది. ముఖ్యంగా తమన్నా భాటియా క్యారక్టర్ హైలైట్ గా వుంది. నాగ సాధువుగా ఆమె అద్భుతంగా నటించింది. తనదైన నటనతో ఈ పవర్ ఫుల్ పాత్రకు తమన్నా ప్రాణం పోసిందనే చెప్పాలి. అలాగే హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ పాత్రలు కీలకంగా వుండనున్నాయి. వీరితోపాటుగా యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి పాత్రలు ఇంట్రెస్టింగ్‍గా వున్నాయి. మొత్తానికి ఓదెల 2 ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.

ఎక్సయిటింగ్ యాక్షన్‌ను అద్భుతమైన కథలతో కలపగల సామర్థ్యం వున్న సంపత్ నంది ఓదెల 2 చిత్రాన్ని సూపర్ విజన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి కాంతర ఫేం అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్, సౌందర్‌రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. టాలెంటెడ్ టీమ్‌తో ఓదెల 2 సినిమా మెమరబుల్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదల కానున్న ఓదెల 2 ఈ వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్స్‌లో ఒకటిగా నిలవనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.