సాలిడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఓదెల 2

Odela 2 is doing massive pre-release business

తమన్నా భాటియా లీడ్ రోల్ లో నటించిన సినిమా ఓదెల 2.ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా వస్తుంది ఈసినిమా.ఫస్ట్ పార్ట్ డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సీక్వెల్ వస్తుంది.ఇక ఈసినిమా టీజర్ తోనే షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. థియేట్రికల్, ఓటిటి రైట్స్ కలిపి 25 కోట్లకు పైగా అమ్ముడయ్యాయట.దాంతో విడుదలకు ముందే బడ్జెట్  రికవరీ అయిపొయింది.ఈసినిమాకు 25కోట్లు ఖర్చు పెట్టారట.సినిమాలో విఎఫ్ఎక్స్ ఎక్కవగా ఉండనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇంకా శాటిలైట్ రైట్స్ డీల్ క్లోజ్ కావాల్సివుంది.దానికి కూడా మంచి ఆఫర్ వస్తుందట.సో రిలీజ్ కు ముందే ఓదెల 2 బయటపడింది.హిట్ టాక్ వస్తే 30 కోట్ల వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ వుంది.రేపు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.సాయంత్రం 4:05 గంటలకు వదలనున్నారు.ఓపెనింగ్స్ కి ట్రైలర్ కీలకం కానుంది. ఇక ఈసినిమా వచ్చిన నెక్స్ట్ డే కి కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ కానుంది.దాంతో ఈరెండు సినిమాల మధ్య పోటీ ఎదురుకానుంది.

ఓదెల 2ను అశోక్ తేజ డైరెక్టర్ చేయగా హెబ్బా పటేల్,మురళి శర్మ ,యువ కీలక పాత్రల్లో నటించారు.కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈసినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.ఈనెల 17న ఓదెల 2 పాన్ ఇండియా రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.