టిల్లు స్క్వేర్ తరువాత యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ జాక్ అనే సినిమాతో వస్తున్నాడు.మరో 3 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నారు.నాలుగు రోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా సెన్సార్ కూడా కంప్లీట్ అయ్యింది.యు/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.రన్ టైం కూడా తక్కువగానే వుంది.2 గంటల 10 నిమిషాల నిడివితో థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బొమ్మరిల్లు భాస్కర్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది.అచ్చు రాజమణి, సామ్ సీఎస్ అందించారు. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.టిల్లు స్క్వేర్ తరువాత సిద్దు నుండి వస్తున్న సినిమాకావడంతో జాక్ పై మంచి అంచనాలు వున్నాయి.ఈసినిమా కూడా విజయంసాధిస్తే సిద్దుకి హ్యాట్రిక్ పడనుంది.
ఇంతకుముందు డీజే టిల్లు ,టిల్లు స్క్వేర్ తో వరుస విజయాలను ఖాతాలో వేసుకున్నాడు.టిల్లు స్క్వేర్ తో ఏకంగా ఈహీరో 100కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. మరి జాక్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.ఇక ప్రస్తుతం సిద్దు తెలుసు కదా అనే సినిమా చేస్తున్నాడు.నీరజ కోన ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా రాశి ఖన్నా ,శ్రీనిధి శెట్టి హీరోయిన్లు గా నటిస్తున్నారు.ఈసినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























