వార్ 2 షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటివరకు పెద్దగా అప్డేట్స్ ఏమి ఇవ్వలేదు.రీసెంట్ గా రిలీజ్ డేట్ చెప్పారు. అది మినిహా ఒక్క పోస్టర్ కూడా బయటికి వదల్లేదు.షూటింగ్ అయిపోయాకనే ప్రమోషన్స్ చేయాలని చూస్తున్నారు.అయితే ఈసినిమా గురించి లేటెస్ట్ గా హృతిక్ రోషన్ అప్డేట్ ఇచ్చాడు.ఒక్క పాట మినహా షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందని సినిమా పార్ట్ 1 కంటే బాగా వస్తుందని ఓ ఈవెంట్ లో అన్నాడు.అలాగే ఎన్టీఆర్ తన ఫేవరేట్ కో యాక్టర్ అని అంటూ హృతిక్ చెప్పుకొచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనెలలో హృతిక్ , ఎన్టీఆర్ ల పై సాంగ్ షూట్ చేయనున్నారు.జూన్ నుండి ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.హిందీ లో ఎన్టీఆర్ కు ఇదే మొదటి సినిమా.ఇంతకుముందు ఆర్ఆర్ఆర్ ,దేవర తో అక్కడ మంచి క్రేజ్ ను తెచ్చుకున్నాడు.బ్రహ్మస్తం ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తుండగా యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.ఆగస్టు 14న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
అయితే హిందీ లో సోలోగా వస్తుండగా తెలుగులో మాత్రం పోటీ ఎదురుకానుంది.అదే రోజున కూలీ కూడా విడుదలవుతుంది.లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో తెలుగులో కూడా ఈసినిమాపై అంచనాలు వున్నాయి.దాంతో వార్ 2 కి తెలుగు ,తమిళంలో భారీ పోటీ ఎదురుకానుంది.
ఇక ఎన్టీఆర్ ఈసినిమాను పూర్తి చేసి ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాలో జాయిన్ కానున్నాడు.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























