నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్ ప్రస్తుతం జోరుమీదుంది. వరుస విజయాలతో అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఆమె నటించిన గత రెండు చిత్రాలు ‘పుష్ప 2: ది రూల్’ మరియు ‘ఛావా’ బ్లాక్ బస్టర్స్ అనిపించుకున్నాయి. ప్రస్తుతం రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ట్యాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి ఆమెకు జోడీగా కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉంది.
వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ ఇప్పటికే ఈ సినిమా టీజర్ చూసి చాలా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో నేడు రష్మిక జన్మదినం సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
‘రేయి లోలోతుల’ అంటూ సాగే ఈ పాటకు హేషమ్ అబ్దుల్ వహాబ్ అద్భుతమైన ట్యూన్ అందించాడు. అలాగే ఆయన చిన్మయి శ్రీపాదతో కలిసి స్వయంగా ఆలపించాడు. ఇక ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యం సమకూర్చగా, రాహుల్ రవీంద్రన్ కవిత రాశారు. అయితే స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా గాత్రం అందించడం విశేషం. ఇంతకుముందు విడుదలచేసిన టీజర్‌లో ఆయన చెప్పిన కవితతో ఈ సాంగ్ మొదలైంది. మొత్తానికి ఇది సినిమాపై అంచనాలను పెంచేసింది.
ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కోసం టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. అలాగే శ్రావ్య వర్మ కాస్ట్యూమ్స్ అందిస్తుండగా.. ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి సంయుక్తంగా ప్రొడక్షన్ డిజైన్ విభాగాన్ని చూసుకుంటున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























