గత ఏడాది ఇదే టైంలో టిల్లు స్క్వేర్ తో కెరీర్ లో మొదటిసారి 100 కోట్ల క్లబ్ చేరాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ. ఈహీరో నెక్స్ట్ జాక్ కొంచెం క్రాక్ తో వస్తున్నాడు.మరో 6 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నారు.ఇక నిన్న ట్రైలర్ ను రిలీజ్ చేయగా దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. 24గంటల్లో ఈ ట్రైలర్ 8.5 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి మొదటిస్థానంలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ట్రైలర్ లో సిద్దు మార్క్ కామెడీ కనిపించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బొమ్మరిల్లు భాస్కర్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది.అచ్చు రాజమణి, సామ్ సీఎస్ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అయితే ఏప్రిల్ 10న అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా విడుదలకానుంది.దాంతో బాక్సాఫీస్ వద్ద జాక్ కు పోటీ ఎదురుకానుంది.
ఇక ఈసినిమా విజయం సాధిస్తే సిద్దు హ్యాట్రిక్ కొట్టనున్నాడు.డీజే టిల్లు ,టిల్లు స్క్వేర్ తో సిద్దు యూత్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు.ఇది జాక్ కి అడ్వాంటేజ్ కానుంది. ప్రస్తుతం సిద్దు తెలుసు కదా అనే సినిమా కూడా చేస్తున్నాడు. నీరజ కోన ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా రాశి ఖన్నా ,శ్రీనిధి శెట్టి హీరోయిన్లు గా నటిస్తున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈసినిమా కూడా ఈఏడాదే విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























