మాస్ మహా రాజా రవితేజ నటిస్తున్న 75వ సినిమా మాస్ జాతర.మనదే ఇందంతా అనేది ట్యాగ్ లైన్.ఈ ల్యాండ్ మార్క్ మూవీని భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు.తనకు ఇదే మొదటి సినిమా.షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.ఈనెలలో భారీ షెడ్యూల్ జరుగనుంది.ఇందులో క్లైమాక్స్ ను చిత్రీకరించనున్నారు.దీని తరువాత ఓ చిన్న షెడ్యూల్ బ్యాలెన్స్ ఉండనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను మే 9న ఈ సినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ అనుకున్న టైంకి షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు.జూలై లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నామని నిర్మాత నాగవంశీ ఈరోజు ప్రెస్ మీట్ లో చెప్పారు.మాస్ జాతరలో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా నటిస్తుండగా శ్రీలీల హీరోయిన్ గా చేస్తుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈసినిమాపై రవితేజ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఇక ఈసినిమా తరువాత రవితేజ నెక్స్ట్ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడు.దసరా నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మించనున్నారట.ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రావాల్సివుంది.అలాగే మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తో రవితేజ సోషియో ఫాంటసీ మూవీ చేయనున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























