పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న పలు ప్రాజెక్టులలో ‘హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ఒకటి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకు యువ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది. మరోవైపు డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మే 9న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టేసారు మేకర్స్. దీనిలో భాగంగా ఇప్పటికే ఈ చిత్రం నుంచి రెండు పాటలు రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు షూటింగ్ సెట్స్ నుంచి డైరెక్టర్ జ్యోతికృష్ణ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా నటుడు బాబీ డియోల్ జ్ఞాతనను ప్రశంసించారు. “ప్రతిభావంతులైన బాబీ డియోల్ గారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది! ఆయన అంకితభావం, నిబద్ధత మరియు ప్రతిభ హరిహర వీరమల్లును కొత్త శిఖరాలకు చేర్చాయి. ఆయన శక్తివంతమైన నటన నన్ను మాటలు లేకుండా చేసింది. బిగ్ స్క్రీన్ పైన ఆయన గొప్ప నటనను చూడటానికి సిద్ధంగా ఉండండి!” అని అందులో పేర్కొన్నారు.
ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్‌లను రూపొందించారు. ప్రముఖ వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, ‘బాహుబలి’ ఫేమ్ శ్రీనివాస్ మోహన్, హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి పని చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























