ట్రెండింగ్‍లో ‘పెద్ది’ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్

Global Star Ram Charan's Peddi Title and First Look Poster Trending in Top

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 16వ చిత్రంతో మరోసారి బిగ్ స్క్రీన్ పై సంచలనం సృష్టించడానికి సిద్ధంగా వున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాన్-ఇండియా స్పెక్టికల్ ని పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. హీరో రామ్ చరణ్‌ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మూవీకి ‘పెద్ది’ అనే టైటిల్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అభిమానులకు, ప్రేక్షకులకు పర్ఫెక్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది పెద్ది టీం. ఈ టైటిల్ రామ్ చరణ్ పాత్ర ఎంత పవర్ ఫుల్‌గా ఉండబోతుందో సూచిస్తోంది.

ఈ చిత్రం కోసం రామ్ చరణ్ ఇంటెన్స్ అండ్ రగ్గడ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయినట్టు తెలుస్తోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ మ్యాసీ హెయిర్ రగ్గడ్ గెడ్డం, నోస్ రింగ్‌తో స్టన్నింగ్ ప్రజెంట్ చేసింది. రగ్గడ్ ఎటైర్‌లో, సిగార్ తాగుతూ, రామ్ చరణ్ ఫెరోషియస్‌గా కనిపించారు. సెకండ్ పోస్టర్ అతను క్రికెట్ బ్యాట్ పట్టుకున్నట్లు ప్రజెంట్ చేశారు. బ్యాక్ డ్రాప్‌లో ఫ్లడ్ లైట్ల ద్వారా ప్రకాశించే గ్రామీణ స్టేడియం ఉంది.

ఈ పోస్టర్లు సినిమా నేపథ్యం, కథనం గురించి ఆసక్తిని రేకెత్తించాయి. రామ్ చరణ్ పాత్రను బుచ్చిబాబు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో ఫస్ట్ లుక్ పోస్టర్లలో అర్ధమౌతోంది. క్యారెక్టర్ పట్ల రామ్ చరణ్ అంకితభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రెండు పోస్టర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్స్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నాయి. ‘పెద్ది’ చుట్టూ ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిన నేపథ్యంలో ఈ పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్ అంచనాలను మరింత పెంచింది.

ఈ చిత్రంలో అద్భుతమైన తారాగణం వుంది. వివిధ చిత్ర పరిశ్రమల నుండి అత్యంత ప్రశంసలు పొందిన నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నడ మెగాస్టార్ శివ రాజ్ కుమార్ ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, జగపతి బాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రంలో అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు ఐఎస్‌సి డీవోపిగా వర్క్ చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇక పెద్ది చిత్రాన్ని భారీ బడ్జెట్, అత్యాధునిక సాంకేతికత, అద్భుతమైన విజువల్స్, ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఎపిక్ స్కేల్‌లో నిర్మిస్తున్నారు. దీని మ్యాసీవ్ స్కేల్ ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్‌పై నిర్మిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.