రామ్ చరణ్ బర్త్ డే.. ‘పెద్ది’పై చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Megastar Chiranjeevi Interesting Comments About Peddi Movie on Ram Charan's Birthday

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చరణ్ తండ్రి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విషెస్ తెలిపారు. అలాగే చరణ్ కొత్త సినిమా పెద్ది గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా.. “మై డియర్ రామ్ చరణ్, పుట్టినరోజు శుభాకాంక్షలు.. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. ‘పెద్ది’ చాలా గంభీరంగా కనిపిస్తున్నాడు. ఇది నీలోని నటుడి యొక్క కొత్త కోణాన్ని బయటకు తెస్తుందని, సినిమా ప్రియులకు మరియు అభిమానులకు ఒక విందుగా ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను!! దీన్ని కొనసాగించండి.” అని పేర్కొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈరోజు ఆయన ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ టైటిల్ ఖరారు చేయబడింది. ఇన్నాళ్ళూ #RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరించబడుతున్న ఈ సినిమాకి ‘పెద్ది’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. అలాగే రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో చరణ్ రగ్గడ్ లుక్‌లో ఊర మాస్‌గా కనిపించాడు.

ఉగాది పండగ రోజున గ్లింప్స్‌ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈరోజే గ్లింప్స్ ఇవ్వాలనుకున్నా వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదాపడింది. ఇక షూటింగ్ విషయానికి వస్తే రెండు రోజుల క్రితమే ఓ భారీ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు. అతి త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. సెప్టెంబర్ లోగా షూటింగ్ కంప్లీట్ చేసి కుదిరితే ఏడాది చివర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సాన ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా.. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.