డెవిల్ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి.ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా ఇందులో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ రోల్ చేస్తుంది. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్.ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఇంతకుముందు టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఈ రోజు ప్రీ టీజర్ వదిలారు. ఇందులో కళ్యాణ్ రామ్ సముద్రం వైపు చూస్తూ బోటు మీద కూర్చొని ఉండగా తన షర్ట్ వెనకాల రక్తం మరకలు వున్నాయి.తన ఫేస్ అయితే రివీల్ చేయలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టీజర్ డేట్ కూడా చెప్పేశారు. ఈనెల 17న ఈ టీజర్ రానుంది.టీజర్ వచ్చాక సినిమాపై అంచనాలు పెరిగిపోవడం ఖాయం.ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్, యానిమల్ పృథ్వీ రాజ్, సోహైల్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.ఏప్రిల్ 18న రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక ఈసినిమా తరువాత కళ్యాణ్ రామ్ నెక్స్ట్ సినిమాను ఇంతవరకు అయితే ప్రకటించలేదు.ప్రస్తుతం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిపైనే కళ్యాణ్ రామ్ ఫుల్ ఫోకస్ పెట్టాడు. సినిమాకూడా బాగా వస్తుందట. ఈసినిమా రిలీజ్ తరువాతే తన నెక్స్ట్ సినిమా అప్డేట్ రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























