అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ టీజర్ డేట్ ఫిక్స్

Arjun Son Of Vyjayanthi PRE-TEASER release date announced

నందమూరి కళ్యాణ్ రామ్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి.ప్రదీప్ చిలుకూరి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ఇందులో కళ్యాణ్ రామ్ కు తల్లిగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ రోల్ చేస్తుంది. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది.దాంతో ప్రమోషన్ కంటెంట్ ను రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈసినిమా ప్రీ టీజర్ ను ఈనెల 14న విడుదలచేయనున్నారు.ఫుల్ టీజర్ ను ఎప్పుడు రిలీజ్ చేయనున్నారో అందులో చెప్పనున్నారు.అన్ని కుదిరితే వచ్చే వారంలో టీజర్ రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రీ టీజర్ అనౌన్స్ మెంట్ సందర్భంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈ పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ స్టైలిష్ అవతార్‌లో కనిపించాడు.ఫ్రెంచ్ గడ్డం, షేడ్స్‌తో, భారీ మైనింగ్ ల్యాండ్‌స్కేప్ లో డైనమిక్ గా వాక్ చేస్తూ రావడం అదిరిపోయింది.

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్, యానిమల్ పృథ్వీ రాజ్, సోహైల్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.ఏప్రిల్ లేదా మే లో విడుదలచేయాలని చూస్తున్నారు.

కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతుంది ఈసినిమా.అంతేకాదు సినిమా కూడా బాగా వస్తుందన్న టాక్ వినిపిస్తుంది.దాంతో ఈసినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేయనుంది.మరి ఈసినిమాతో కళ్యాణ్ రామ్, బింబిసార తరువాత మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.