రాబిన్‌హుడ్‌ మ్యూజిక్ అదిరిపోద్ధి

Composer GV Prakash Kumar Interesting Comments on Robinhood BGM

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్‌’ మ్యూజిక్ అదిరిపోనుందట. ఈ మేరకు ఈ సినిమాకు సంగీతం అందించిన కంపోజర్ జివి ప్రకాష్‌ కుమార్ తాజాగా దీనిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలచేసిన రాబిన్ హుడ్ టైటిల్ గ్లింప్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్‌గా జివి ప్రకాష్‌ హీరోగా నటించిన ‘కింగ్‌స్టన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా హీరో నితిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ వేదికపై జివి ప్రకాష్‌ని సరదాగా కొన్ని ప్రశ్నలు అడుగగా.. ఆయన వాటికి స్పాంటేనియస్‌గా బదులిచ్చారు. ఈ క్రమంలో కింగ్‌స్టన్ బీజీఎమ్ బావుంటుందా? లేదంటే.. రాబిన్‌హుడ్‌ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంటుందా? అని నితిన్ ప్రశ్నించారు.

దీనిపై స్పందిస్తూ జివి ప్రకాష్‌ కుమార్ ఇలా చెప్పారు.. రాబిన్‌హుడ్‌ బీజీఎమ్ చాలా స్పెషల్‌గా ఉంటుంది, పిచ్చెక్కిస్తుంది. ఈ సినిమా స్టైలిష్‌గా ఉంటుంది. హీరో నితిన్ ఇందులో భలే స్టైలిష్‌ అవతార్‌లో కనిపిస్తారు. ఈ సినిమాను నేను చెన్నైలో చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో యాక్షన్, కామెడీతోపాటు అన్నీ మంచిగా వర్కవుట్ అయ్యాయి. రాబిన్‌హుడ్‌ రిలీజ్ కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని చెప్పారు.

కాగా ఈ సినిమాకి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్, వెంకీ కాంబోలో ఇంతకుముందు ‘భీష్మ’ అనే సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక ఈ యూనిక్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్‌లో నితిన్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మూవీలో ఓ క్యామియో రోల్‌లో కనిపించనున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.