అఫీషియల్.. రాబిన్‌హుడ్‌లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్

Australian Star Cricketer David Warner To Feature in Nithiin's Robinhood

గత కొన్ని రోజుల క్రితం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో నితిన్ ఇప్పుడు ఏక కాలంలో రెండు చిత్రాలలో నటిస్తున్నాడు. వీటిలో ఒకటి శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘తమ్ముడు’ కాగా, మరొకటి వెంకీ కుడుముల డైరెక్షన్‌లో రూపొందుతోన్న ‘రాబిన్‌హుడ్‌’. ఈ రెండు సినిమాలపై మంచి బజ్ ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే నితిన్, వెంకీ కుడుముల ఇద్దరూ కలిసి ఇంతకుముందు ‘భీష్మ’ అనే సినిమా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. వీరిద్దరూ ఈసారి యూనిక్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో నితిన్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలచేసిన రాబిన్ హుడ్ టైటిల్ గ్లింప్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

ఈ నేపథ్యంలో రాబిన్‌హుడ్‌ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో ఒక స్టార్ క్రికెటర్ నటించనున్నారు. అది కూడా ఆస్ట్రేలియా క్రికెటర్ కావడం విశేషం. తెలుగువారికి సుపరిచితమైన ఆసీస్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ఈ మూవీలో ఓ క్యామియో రోల్ లో కనిపించనున్నాడు. ఈ మేరకు చిత్ర నిర్మాత రవిశంకర్ ‘కింగ్‌స్టన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అధికారికంగా ప్రకటించారు.

కాగా ఐపీఎల్ లో ‘సన్‌రైజర్స్ హైదరాబాద్‌’ టీమ్ తరపున కెప్టెన్‌గా మరియు కీలక ఆటగాడిగా ఎన్నో మ్యాచ్‌లను ఆడిన వార్నర్ తెలుగువారికి బాగా పరిచయమే. స్వతహాగా క్రికెటర్ అయినప్పటికీ వార్నర్‌లో ఒక మంచి నటుడు కూడా ఉన్నాడు. ఇంతకుముందు ఎన్నోసార్లు తెలుగు సినిమాల పాటలు మరియు డైలాగులను ఇమిటేట్ చేస్తూ ఆయన చేసిన పలు రీల్స్ ఇక్కడివారిని ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో నితిన్ చిత్రం ద్వారా వార్నర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్ కోసం ఆయన అందించిన అద్భుతమైన స్కోర్‌ ఆకట్టుకుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.