దసరా తరువాత నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రానున్న సినిమా ది ప్యారడైజ్.దసరాతో నాని ఊర మాస్ లో కనిపించగా ది ప్యారడైజ్ అంతకుమించిన యాక్షన్ తో తెరకెక్కనుంది.ఇక ఈసినిమా నుండి గ్లింప్స్ చేయనున్నారని అనౌన్స్ మెంట్ వచ్చిన దగ్గరినుండి అంచనాలు భారీగా పెరిగాయి.ఈ గ్లింప్స్ వైల్డ్ అండ్ బోల్డ్ గా రానుందని చెప్పేసరికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొద్దీ సేపటి క్రితం ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. రా స్టేట్మెంట్ పేరుతో తెలుగు తోపాటు తమిళ,కన్నడ , మలయాళ , బెంగాలీ , హిందీ , ఇంగ్లీష్ , స్పానిష్ భాషల్లో రిలీజ్ చేశారు.ఇక హైప్ తగ్గట్లే వుంది ఈ గ్లింప్స్.ఇందులో నాని లుక్ , తన చేతి మీద వున్న టాటూ టాక్ ఆఫ్ ది టౌన్ కానుంది.తెలంగాణ యాసలో ఓ తల్లి తన కొడుకును పరిచయం చేస్తూ సాగిన ఈ గ్లింప్స్ లో విజువల్స్ ,బీజీఎమ్ హైలైట్ అయ్యాయి.రా అండ్ బ్లోడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది ఈసినిమా.ఓవరాల్ గా ది ప్యారడైజ్ నాని కెరీర్ లోనే ప్రత్యేకమైన సినిమాకానుంది.సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.రిలీజ్ డేట్ ను కూడా చెప్పేశారు.వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది.
ఇక ప్రస్తుతం నాని, హిట్ 3 చేస్తున్నాడు.శైలేష్ కొలను ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.మే 1న హిట్ 3ని థియేటర్లలోకి తీసుకురానున్నారు.ఈసినిమా రిలీజ్ తరువాత నాని ది ప్యారడైజ్ ను మొదలు పెట్టనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























