ఛత్రపతి శివాజీ లుక్‌లో రిషబ్ శెట్టి.. న్యూ పోస్టర్ రిలీజ్

Rishab Shetty's Brand New Poster Unveils From Chhatrapati Shivaji Maharaj

శాండల్‌వుడ్ స్టార్ డైరెక్టర్ కం యాక్టర్, నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్ హీరో రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార’ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు కాంతార ప్రీక్వెల్‌ ‘కాంతార: చాఫ్టర్ 2’ లో ప్రధానపాత్రలో నటిస్తున్న ఆయన.. ఇంకోవైపు టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ సినిమాలో హనుమంతుడి పాత్రను పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వీటితోపాటుగా రిషబ్‌ శెట్టి ఒక క్రేజీ బయోపిక్‌తో ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ చిత్రంలో ఆయన టైటిల్ పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్ చేయగా.. మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ అందించారు మేకర్స్.

నేడు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా.. సినిమాలో శివాజీ మహారాజ్ పాత్రధారి అయిన రిషబ్‌ శెట్టి బ్రాండ్ న్యూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ గమనిస్తే.. కాళీమాత భారీ విగ్రహం ఎదుట నిలబడి ఉన్న ఛత్రపతి శివాజీగా ఖడ్గం చేత బట్టి ఠీవిగా నిలబడి , వీరత్వం ఉట్టిపడే లుక్‌లో కనిపించారు రిషబ్ శెట్టి. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కాగా ఈ హిస్టారికల్ డ్రామాకు సందీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాను 2027 జనవరి 1న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. హిందీతో పాటు త‌మిళం, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాషల్లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర‌బృందం తెలిపింది. ఇటీవలే శివాజీ తనయుడు ‘శంభాజీ మహారాజ్’ బయోపిక్ ‘ఛావా’ విడుదలై ఘనవిజయం సాధించిన నేపథ్యంలో శివాజీ కథ ఆధారంగా వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.