కోడి రామ్మూర్తి కథని తీయాలనివుంది – అల్లు అరవింద్

Producer Allu Aravind Plans For Kodi Rammurthy Naidu Biopic

ప్రముఖ దివంగత మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు జీవితం చరిత్రను తెరకెక్కించాలని యోచిస్తున్నట్టు తెలిపారు అగ్ర నిర్మాత అల్లు అరవింద్. అయితే దీనిని సినిమాగా కానీ లేదా వెబ్‌సిరీస్‌ రూపంలో అయినా కానీ చేయాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన తాజాగా శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో జరిగిన ‘తండేల్’ టీం బ్లాక్ బస్టర్ లవ్ సునామీ థాంక్ యూ మీట్ వేడుకలో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది.

ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ‘తండేల్’ హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ‘తండేల్’ టీం బ్లాక్ బస్టర్ లవ్ సునామీ థాంక్ యూ మీట్ నిర్వహించారు. శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో జరిగిన ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ వేడుకలో నాగాచైతన్య, సాయిపల్లవి స్టేజ్ పై డ్యాన్స్ చేయడం ప్రేక్షకులని విశేషంగా అలరించింది.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఒక కథను తీసుకుని సినిమా చేశాం. ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాలో అత్యద్భుతంగా నటించిన నాగ చైతన్య గారికి, లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి గారికి, సినిమాని అద్భుతంగా తీసిన డైరెక్టర్ చందుకి థాంక్యూ. సినిమాకి పని చేసిన అందరికీ కృతజ్ఞతలు” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “కోడి రామ్మూర్తి గారి స్టేడియంలో ఈ వేడుక జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఈ ప్రాంతంలో పుట్టి దేశానికి ఎన్నో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. ఆయన కథని ఏనాటికైనా ఒక సినిమాగా కానీ, వెబ్ సిరీస్ కానీ చేయాలని తలుస్తున్నాం.” అని చెప్పారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.