కేవలం ఎనిమిది నెలల గ్యాప్‌లో మూడు చిత్రాలతో సందడి చేసి ఆశ్చర్యపరిచారు సూపర్ స్టార్ రజనీకాంత్. `కాలా`, `2.ఓ`, `పేట` పేర్లతో వచ్చిన ఈ మూడు సినిమాలూ రజనీ అభిమానులను అలరించాయి. ఇదిలా ఉంటే… సూపర్ స్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ బ్రిలియంట్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందనున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో రజనీ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే… తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేమిటంటే… రజనీ, మురుగదాస్ కాంబినేషన్ సినిమా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ అయినప్పటికీ… రజనీది మాత్రం పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అని తెలిసింది. ‘మూన్‌డ్రు ముగమ్’, ‘పాండియన్’, ‘కోడి పరక్కుతు’ తదితర విజయవంతమైన చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన రజనీ… దశాబ్దాల తర్వాత పోలీసు అధికారిగా నటించే సినిమా ఇదే అవుతుంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా… ఈ సినిమాలో రజనీకి జోడీగా కీర్తి సురేష్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
[youtube_video videoid=h2K6y-aVFD8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























